టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ బాస్ పార్టీ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా నిన్న, మెగా హీరో చిరు ఈ సినిమా నుండి రెండవ సింగిల్ యొక్క వాయిస్ గ్లింప్స్‌ను లీక్ చేశాడు. ఈ క్లిప్‌కి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ ఉంది. చాలా మంది అభిమానులు ఈ పాటను DSP పాడారని భావించారు. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, అద్నాన్ సామి ఈ సాంగ్ ని పడినట్లు సామాచారం. నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa