మలయాళ సినిమాలు రీమేక్ కావడం, ఇతర భాషల్లోకి అనువాదం అవ్వడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. మలయాళ సినిమాల్లో ఉండే బలమైన కంటెంట్, సహజత్వం.. ఇందుకు కారణమని తెలుస్తుంది. భీమ్లానాయక్, గాడ్ ఫాదర్.. మలయాళ రీమేక్ లే.
తాజాగా మలయాళం నుండి తెలుగులోకి డబ్ ఐన చిత్రం "పులి". పాథోన్పతం నూత్తండు టైటిల్ తో సెప్టెంబర్ లో మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ తెలుగు టీజర్ ను కొంతసేపటి క్రితమే విడుదల చేసారు. 19 వ శతాబ్దంలో ఉన్నత కులాలకు, తక్కువ జాతి కులాలకు మధ్య జరిగిన పోరాటం, తక్కువ జాతి కులాలు ఎదుర్కొన్న ఎన్నో దుర్భరమైన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. టీజర్ ఆసక్తికరంగా సాగింది.
వినయన్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సిజు విల్సన్, అనూప్ మీనన్, చెంబన్ వినోద్ ప్రధాన పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa