యంగ్ హీరో అడివిశేష్ కెరీర్ లో ఈ ఏడాది మెమొరబుల్ గా మిగిలిపోతుంది. మేజర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని, పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న శేష్ రీసెంట్గానే హిట్ 2 రూపంలో మరొక మేజర్ హిట్ ను అందుకున్నారు.
అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిట్ 2 మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా మూడవ వారంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని గారు నిర్మించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa