ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF 2' రికార్డును బద్దలు కొట్టిన 'అవతార్ 2'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 07:42 PM

సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సినిమాలని తీశారు. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలతో సినిమా ప్రేమికులని అండ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. చాలా కాలంగా ఈ డైరెక్టర్ అవతార్ సీక్వెల్ కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా నటించారు.


అవతార్‌ సీక్వెల్‌ గా రానున్న ఈ మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


భారతదేశంలో ఈ చిత్రం కొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమా స్క్రీనింగ్‌కు ముందు ప్రారంభ వారాంతంలో దేశవ్యాప్తంగా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లలో 4 లక్షల 40 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇంతకుముందు అత్యధికంగా అమ్ముడైన  (4 లక్షల 11 వేల టిక్కెట్లు అడ్వాన్స్‌గా) KGF 2 సృష్టించిన రికార్డు ని ఈ సినిమా బీట్ చేసింది.


ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు TSG ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa