ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB28' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 08:07 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28'అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వారాలు వినిపిస్తున్నాయి.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ 16 నుండి తిరిగి ప్రారంభమవుతుంది అని సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో రానున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రూపొందించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa