పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న "హరిహర వీరమల్లు" షూటింగ్ పూర్తి కాకుండానే రెండు కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసి, అభిమానుల్లో ఆసక్తిని రేపారు. పవన్ ఎనౌన్స్ చేసిన రెండు కొత్త ప్రాజెక్టుల్లో డైరెక్టర్ హరీష్ శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" ఒకటి.
రీసెంట్గానే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో ఒక ప్రామినెంట్ రోల్ లో యంగ్ మెగా హీరో నటించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఆయనెవరో కాదు... టాలీవుడ్ 'గద్దలకొండ గణేష్' అదేనండి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మరి, ఈ వార్త మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపుతుండగా, త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తే.. ఫుల్ పండగ చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa