టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఆ మధ్య ఓ టాలీవుడ్ యువనటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం జరిదింది. తాజాగా మరో యువనటుడు సందీప్ కిషన్ తో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ భామ ఇటీవలే తన 32వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్ యూ. నీకెప్పుడూ మంచే జరగాలి' అంటూ తను రెజీనాతో సన్నిహితంగా ఉన్న ఫోటోను సందీప్ ట్వీట్ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa