నిన్న విడుదలైన ధమాకా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి థంపింగ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న సాయంత్రం 06:45 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ అప్పుడే యూట్యూబులో 3.4M వ్యూస్ ను, 120కే లైక్స్ ను సాధించేసి, టాప్ #1 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. పోతే, ఈ ట్రైలర్ తో రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ధమాకా సినిమా భారీ అంచనాలను ఏర్పరచుకుంది.
శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. నక్కిన త్రినాధరావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాబోయే శుక్రవారానికల్లా ధమాకా మూవీ థియేటర్లలో సందడి చేస్తూ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa