ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : తెలుగులో 'తెగింపు' గా రాబోతున్న అజిత్ 'తునివు'

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 04:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ నుండి ఈఏడాది వలిమై వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". వలిమై ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.


తాజా అధికారిక సమాచారం ప్రకారం, తునివు సినిమాను తెలుగులో "తెగింపు" టైటిల్ తో విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మేరకు గతంలోనే ప్రచారం జరగ్గా, ఇప్పుడు దానినే మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. 


మంజూ వారియర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa