ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌పాన్ అభిమానుల‌కు రెబల్ స్టార్ న్యూఇయర్ గ్రీటింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 10:19 PM

బాహుబలి సినిమా ఎఫెక్టుతో జపాన్లో కూడా ప్రభాస్‌కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. దీంతో అక్కడ తన ఫ్యాన్ బేస్ మరింత విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు యంగ్ రెబల్ స్టార్. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వారికి న్యూఇయర్ గ్రీటింగ్స్ పంపారు. కొత్త సంవత్సర వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆంకాంక్షిస్తూ... ప్రభాస్ తన ఫోటోలతో తయారు చేయించిన గ్రీటింగ్ కార్డులపై జపనీస్ భాషలో విష్ చేస్తూ వాటిని పంపారు. తాము అభిమానించే స్టార్ నుంచి గ్రీటింగ్స్ రావడంతో జపనీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ప్రభాస్ పంపిన గ్రీటింగ్ కార్డ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులకు ప్రభాస్ ఎంత వ్యాల్యూ ఇస్తారో చెప్పడానికి ఇదొక ప్రత్యక్షనిదర్శమని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటే తనను కలవడానికి వచ్చే అభిమానులు ప్రభాస్ ఏమాత్రం నిరాశ పరచడని, వారితో కలిసి తప్పకుండా ఫోటోలు దిగుతారని ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ‘సాహో' చిత్రం ఇండియన్ సినీమా చరిత్రలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్లు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ‘సాహో' తర్వాత ప్రభాస్ ‘జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. పూజా హెగ్డే హీరోయిన్‌. యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa