తెలుగు హిట్ ‘టెంపర్’కు హిందీ రీమేక్ సింబా. రోహిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ పోలీసు అధికారిగా ఆకట్టుకున్నాడు. సారా అలీ ఖాన్ హీరోయిన్. ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. విదేశాల్లోనూ ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ‘సింబా’ సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేశారు. వీరితోపాటు చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి, నిర్మాత కరణ్ జోహార్ కూడా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో దీపిక.. కరణ్, రోహిత్, రణ్‌వీర్‌ను ఆశీర్వదిస్తూ సరదాగా కనిపించారు. వారేం తక్కువ కాదు.. ‘రాణి పద్మావతి’ ఆశీర్వదించడం మా అదృష్టం అని భావిస్తూ ఆమెకు నమస్కారం చేశారు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈ పార్టీలో వీరితోపాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, కాజోల్ కూడా సందడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa