ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుర్తుందా సీతకాలం' 11 రోజుల కలెక్షన్స్ బ్రేకప్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 03:07 PM

నాగశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్‌ నటించిన 'గుర్తుందా సీతకాలం' డిసెంబర్ 9, 2022న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.18 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రం కన్నడ హిట్ చిత్రం లవ్ మోక్‌టెయిల్‌కి అధికారిక రీమేక్.


ఈ సినిమాలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, సుహాసిని, మేఘా ఆకాష్ మరియు కావ్య శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి MM కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ సంయుక్తంగా నిర్మించారు.


కలెక్షన్స్ బ్రేకప్ ::::::
నైజాం -  0.15 కోట్లు
సీడెడ్ -  0.11 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ -  0.18 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com