ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్ వేద' హిందీ వెర్షన్ ఈ తేదీన OTT అరంగేట్రం చేయనుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 07:08 PM

మాధవన్ అండ్ విజయ్ సేతుపతి నటించిన తమిళ సినిమా "విక్రమ్ వేద" సినిమాని హిందీలో హృతిక్ రోషన్ అండ్ సైఫ్ అలీ ఖాన్ రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 30, 2022న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది. పుష్కర్ అండ్  గాయత్రి  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విక్రమ్ రోల్ లో కనిపించనుండగా, హృతిక్ రోషన్  వద రోల్ పోషిస్తున్నాడు.


ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని Voot సెలెక్ట్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. విక్రమ్ వేద, త్వరలో డిజిటల్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జనవరి 9, 2023న వూట్ సెలెక్ట్ మరియు జియో సినిమాల్లో ఈ సినిమా ప్రీమియర్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష్యం గురించి మూవీ మేకర్స్ లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఈ నియో-నోయర్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa