నందమూరి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ నవీన్ మేడారం డైరెక్షన్లో నటిస్తున్న సినిమా "డెవిల్ : ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్". గతేడాదిలో అధికారికంగా ప్రకటింపబడిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. థర్డ్ షెడ్యూల్ కోసం డెవిల్ చిత్రబృందం రీసెంట్గానే తమిళనాడు, మధురైలోని కారైకుడికి వెళ్ళింది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, డెవిల్ థర్డ్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా కథను అందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa