ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాని కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఇది నానీకి 30వ సినిమా. ఈ సినిమాను మోహన్ చెరుకూరి-విజయేందర్ రెడ్డి నిర్మించనున్నారు. కాగా, ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా ‘సీతారామం’ బ్యూటీ మృణాళ ఠాకూర్ కనిపించనుందని సమాచారం. సీత పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.