ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెట్ రెడీ.. చైతూ "కస్టడీ" న్యూ ఇయర్ ట్రీట్ కి టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 03:34 PM

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కాంబోలో రాబోతున్న ద్విభాషా చిత్రం "కస్టడీ". పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మ్యాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి న్యూ ఇయర్ ట్రీట్ గా రేపు ఉదయం 10:43 నిమిషాలకు బిగ్ అప్డేట్ రాబోతుంది. ఈ మేరకు కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది.


అరవింద్ స్వామి, ప్రియమణి, ప్రేమ్ జీ అమరేన్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12, 2023న థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa