క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్, క్రేజీ హీరోయిన్ సమంత కలయికలో రాబోతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం". దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్యా నాగళ్ళ, ప్రకాష్ రాజ్, మధుబాల, జిష్షు సేన్ గుప్తా, శరద్ ఖేడ్కర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా, 3డి లో కూడా విడుదల చేస్తున్న కారణంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది.
తాజాగా ఈ రోజు న్యూ ఇయర్ ని పురస్కరించుకుని మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం పదకొండు గంటలకు శాకుంతలం సినిమా నుండి ఎక్జయిటింగ్ అప్డేట్ రాబోతుందని అధికారిక ప్రకటన చేసారు. దీంతో సమంత అభిమానులకు మంచి న్యూ ఇయర్ ట్రీట్ లభించినట్టయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa