నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పార్ట్-1 స్ట్రీమ్ అయ్యి చరిత్ర సృష్టిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందు ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావించారు. కానీ, సంక్రాంతికి ప్రోమో రిలీజ్ చేసి.. నెలాఖరుకలో లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.