నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ట్రైలర్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడే వీరసింహారెడ్డి ట్రైలర్ చూశాను. యూట్యూబ్ లో రచ్చ రచ్చ. జనవరి 6న కలుద్దాం. జై బాలయ్య’ అని ట్వీట్ చేశాడు. అయితే, జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.