నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’షోలో మరో క్రేజీ కాంబో సందడి చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్, పవన్ కల్యాణ్ వంటి దిగ్గజాలను బాలయ్య ఇంటర్వ్యూ చేయగా.. తర్వాత ఎపిసోడ్ లో మంత్రి కేటీఆర్, రాంచరణ్ ఉంటారని తెలుస్తోంది. సంక్రాంతికి పవన్ కల్యాణ్ షో ముగిసిన తర్వాత వీరి ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. ఇక సీజన్-3లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి వస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై ఆహా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.