నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన రీసెంట్ హిట్ మూవీ "అఖండ". బాలయ్య ద్విపాత్రాభినయం, బోయపాటి స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్సెస్, థమన్ ఫుట్ టాప్పింగ్ ట్యూన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
తాజా అధికారిక సమాచారం మేరకు, అఖండ హిందీలో కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అఖండ ట్రైలర్ రిలీజ్ కానుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. . పోతే, ఈ నెల 20న అఖండ హిందీ వెర్షన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa