రాజమౌళి రూపొందించిన RRR మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు గ్లోబల్ లెవెల్లో చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇండియాలో ప్రభంజన విజయం సాధించగా, వెస్టర్న్ దేశాలలో సంచలనం గా మారింది.
తాజాగా RRR సినిమాకు గానూ తారక్ ఒక అరుదైన ఘనత సాధించినట్టు తెలుస్తుంది. వరల్డ్ పాపులర్ మ్యాగజైన్ 'వెరైటీ' అంచనా వేసి రూపొందించిన టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఆస్కార్ రేస్ లోతారక్ చోటు సంపాదించాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ యాక్టర్ కి దక్కని ఈ అరుదైన గౌరవం తారక్ కి దక్కడంతో నందమూరి అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు.