ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ దీపిక పుట్టిన రోజు సందర్భంగా ప్రాజెక్ట్-K టీం ఆమెకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. దీపిక ఫుల్ లుక్ రివీల్ చేస్తూ, పేస్ మాత్రం కనబడకుండా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘చీకటిలో ఆమె ఒక ఆశ’ అంటూ రాసుకొచ్చారు. ఈ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.