నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న సరికొత్త చిత్రం "వీరసింహారెడ్డి". గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ వీరసింహారెడ్డి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఒంగోలు AMB కాలేజీ గ్రౌండ్స్ లో జనవరి 6వ తేదీన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరగింది. ఐతే, తాజాగా ఈవెంట్ లో మార్పును సూచిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఒంగోలు మార్కెట్ యార్డు కి అపోజిట్ లో ఉండే అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్ లో, రేపు సాయంత్రం ఆరింటి నుండి వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది.