మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజు సాయంత్రం 06:03 నిమిషాలకు వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల కాబోతుందని కొంతసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి అనౌన్స్ చేసారు.
బాబీ కొల్లి డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటిస్తున్నారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా, బాబీ సింహ విలన్గా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa