సూపర్ స్టార్ మహేష్ బాబు సౌత్ ఇండియాలో నే అత్యధిక బ్రాండ్స్ కు ఎండార్స్ చేస్తున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన 15 బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా థమ్స్ అప్ , అభిబస్ ,చెన్నై సిల్క్స్ , క్లోజ్ అప్,గోల్డ్ విన్నర్ ల తో పాటు ఇతర బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
ఇక సినిమాల విషయాల కొస్తే మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం మహర్షి లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన , సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇక సుకుమార్ -మహేష్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వన్ నేనొక్కడినే చిత్రం తెరకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa