న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘జెర్సీ చిత్రం యొక్క టీజర్ ఈ రోజు విడుదలైయింది. 1:28 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ను ఎమోషనల్ సన్నివేశాలతో నింపేశారు. అర్జున్ పాత్రలో క్రికెటర్ గా నాని లుక్ బాగుంది. ముఖ్యంగా లాస్ట్ డైలాగ్ ‘ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నించి ఓడిపోయినోడు లేడు’ అంటూ సాగె డైలాగ్ సూపర్ గా వుంది. చివరగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.
సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకులముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa