తెలుగు సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రమాదం జరిగింది. అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమా షూటింగ్‌లో సురేందర్ గాయపడ్డాడు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇనుప రాడ్ అతని కాలికి బలంగా తగిలి గాయమైందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలికి కట్టు కట్టిన వైద్యులు కాస్త విశ్రాంతి తీసుకోవలి అని తెలిపారు.