బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆర్యన్ బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా పాక్ నటి సాదియా ఖాన్‌తో ఆర్యన్ సన్నిహితంగా ఉన్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కాగా ఆర్యన్ గతంలో డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.