తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'జైలర్'.ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు.ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.