కొంతసేపటి క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న "శబరి" వరల్డ్ గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ప్లెజెంట్ విజువల్స్ తో మొదలైన ఈ వీడియో ఆపై ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మన ఇంట్లోకి ఒక మాన్స్టర్ దూరి, మనం ప్రేమించినవాళ్లను హింసిస్తుంటే, వారి కోసం ఆ మాన్స్టర్ ని ధైర్యంగా ఎదుర్కొన్న సాధారణ మహిళ 'శబరి' కథే ఈ సినిమా. మొత్తానికి ఈ వీడియోతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
అనిల్ కట్స్ డైరెక్షన్లో ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునైనా, బేబీ కృతిక, రాజశ్రీ నాయర్, భద్రం, ఫణి, కృష్ణ తేజ, ప్రభు,అర్చన ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa