ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్న సినిమాలలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న "వారసుడు" ఒకటి. తమిళంలో రూపొందిన "వారిసు"కి ఈ సినిమా తెలుగు డబ్బింగ్. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుండి సై దళపతి అనే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. థమన్ స్వరపరిచిన ఈ పాట ఆల్రెడీ తమిళంలో విడుదలై, మిలియన్ల కొద్దీ వీక్షణలు పొంది, యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాసన్ కలిసి ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa