ఈనెల 25న విడుదల కాబోతున్న "పఠాన్" సినిమాతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ విరామం తదుపరి మొదటిసారిగా ప్రేక్షకులను బిగ్ స్క్రీన్ పై పలకరించబోతున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీరోల్స్ లో నటిస్తున్నారు.
పోతే, పఠాన్ మూవీ తెలుగు, తమిళ భాషలలో కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ రోజు విడుదలైన పఠాన్ ట్రైలర్ ను తెలుగులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ రాంచరణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసారు. మీ RRR టీం ఆస్కార్ ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చెయ్యనివ్వండి.. అని క్యూట్ గా తెలుగులో షారుఖ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa