నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి "వీరసింహారెడ్డి" గా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మరో రెండ్రోజుల్లో అంటే జనవరి 12న థియేటర్లకు రాబోతుంది.
ఈ సంక్రాంతికి బాలయ్య నుండి మరొక బహుమతి కూడా రాబోతుంది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు వీరసింహారెడ్డి టీంను తీసుకొచ్చి, క్రేజీ టాక్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు డైరెక్టర్ గోపీచంద్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈమేరకు అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ పిక్స్ ను ఆహా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa