బాహుబలి 2 తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకోవడంపై మీడియా లో రకరకాల వార్తలువచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఈ రూమర్స్ ను బ్రేక్ చేస్తూ.. అనుష్క సైలెన్స్ అనే సినిమాతో సైలెంట్ గా సమాధానం చెప్పనుంది. మాధవన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఎక్కువభాగం యూఎస్ లో జరుగుతుందని చెప్తున్నారు. కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు. అరుంధతి, భాగమతి మించిన పాత్రలను మించి అనుష్క పాత్ర ఉంటుందని వినవస్తోంది. అన్నట్టు ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టార్ హీరో కిల్ బిల్ ఫేం ‘మైఖేల్ మాడ్సన్’ని ఓ కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసారట. అమెరికాలో జరగనున్న ప్రధాన సన్నివేశాలలోఈహాలీవుడ్ స్టార్ హీరో చేయనున్నారనే కబురు అందిన నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa