భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ దూసుకెళ్తోంది. ఇక ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టిన RRR చిత్రం తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకుంది. సినిమాలోని 'నాటు నాటు' పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈమేరకు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అవార్డ్‌ని సంగీత దర్శకుడు కీరవాణి అందుకోగా, స్టేజ్ కింద రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ చప్పట్లతో హోరెత్తించారు.