తలపతి విజయ్ కొత్త సినిమా "వారిసు" ప్రపంచవ్యాప్తంగా నిన్నే భారీ విడుదల కాగా, పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకనిర్మాతలు వంశీ పైడిపల్లి, దిల్ రాజు తలపతి విజయ్ కు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. అంతేకాక మరో రెండ్రోజుల్లో వారసుడు రిలీజ్ ఉండడంతో, ఈ రోజు హైదరాబాద్ వచ్చి వారసుడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొనవలసినదిగా విజయ్ ను కోరారట. వారిసు తెలుగులో వారసుడు టైటిల్ తో ఈనెల 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా.
పోతే, హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం వారసుడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరగనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa