మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య" రేపే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మెగామాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ మార్కెట్స్ తో పాటుగా ఓవర్సీస్ మార్కెట్స్ లోనూ వాల్తేరు వీరయ్య అడ్వాన్స్ సేల్స్ జోరుగా జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య టికెట్లు ఓవర్సీస్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న కారణంగా తాజాగా హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ కి ఈ సినిమా కలెక్షన్లు చేరినట్టు తెలుస్తుంది. విడుదలకు ముందే హాఫ్ మిలియన్ కు చేరుకున్న కలెక్షన్లు విడుదల తరవాత మరింత ఎక్కువవుతాయని చెప్పుకోనక్కర్లేదు కానీ.. ఏ మ్యాజికల్ ఫిగర్ దగ్గరికి వెళ్లి ఆగుతాయి ..? అన్నది ఆసక్తిగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa