'హుషారు' యువ హీరో దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "అలా నిన్నుచేరి". రీసెంట్గానే ఈ మూవీటైటిల్ మోషన్ పోస్టర్ విడుదలై ప్రేక్షకుల దృష్టిలో పడింది. తాజాగా అలా నిన్ను చేరి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల కాబోతుంది. రేపు ఉదయం 11:22 నిమిషాలకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అలా నిన్ను చేరి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాకు మారేష్ శివన్ డైరెక్టర్ కాగా, కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. సుభాష్ ఆనందన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa