విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న సినిమా "ధూమం". ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా, అపర్ణా బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. హీరో సూర్య "ఆకాశమే నీ హద్దు" సినిమాతో అపర్ణ హీరోయిన్ గా బాగా పాపులారయ్యింది.
పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఫాహద్ ఫాజిల్ తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.
పోతే, అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఈ ఏడాది వేసవికి విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa