మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు ఒకే స్క్రీన్ పై కనిపించి, ప్రేక్షకులకు మాస్ పూనకాలను తెప్పిస్తున్నారు. ఈ రోజే విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీ డొమెస్టిక్, ఓవర్సీస్ మార్కెట్స్ నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య ను చిత్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 'మెగామాస్ బ్లాక్ బస్టర్' గా డిక్లేర్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. భారీ అంచనాలు, అందుకు తగ్గట్టు సినిమా ఉందని రిపోర్ట్స్ వస్తుండడంతో ఇక, ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఆపేవారే లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్యకు ఫస్ట్ డే భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం కూడా భేషుగ్గా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa