అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కళ్యాణం కమనీయం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా OTT మరియు శాటిలైట్ రైట్స్ 7 కోట్లలకి అమ్ముడుపోయినట్లు సమాచారం. యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమ్నేని కెమెరావర్క్ అందించారు.
![]() |
![]() |