బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు శుక్రవారం తీవ్ర గాయాలయ్యాయి. 'ఇన్స్పెక్టర్ అవినాష్' అనే టీవీ సిరీస్ షూటింగ్ సమయంలో రణదీప్ గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రణదీప్ ఎడమ కాలికి గాయం కావడంతో సర్జరీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రణదీప్ పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa