శ్రీవాస్ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. తాజగా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి 'రామ బాణం' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa