ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తదుపరి చిత్రంలో పోలీసుగా వరుణ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 09:08 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి టెంపరరీగా  'VT12' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్య కనిపించనుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ మూవీలో వరుణ్ తేజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు అని సమాచారం.


ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి వాన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని లేటెస్ట్ టాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com