సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుందని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడని తెలిపారు. కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుందన్నారు. కాగా, ప్రభాస్ ఇప్పటివరకు పోలీసు పాత్రలో నటించలేదు. మరోవైపు రణ్ బీర్ నటిస్తున్న యానిమల్ మూవీని ఆగస్టు 11న విడుదల చేస్తామన్నారు.