గతేడాది కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు విక్రమ్ ఈ ఏడాది 'తంగలాన్' పాన్ ఇండియా మూవీ తో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తూ, సినిమాపై భారీ అంచనాలను నమోదు చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు, తంగలాన్ పోస్ట్ ధియేట్రికల్ రిలీజ్ ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు తంగలాన్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ చేజిక్కించుకుందని పేర్కొంటూ మేకర్స్ న్యూ పోస్టర్ ను విడుదల చేసారు.
క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa