సూపర్ స్టార్ మహేష్ బాబు గారి న్యూ మూవీ 'SSMB 28' లో లీడ్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం అందరికి తెలుసు. ఐతే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందని, ఆ పాత్రలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆపై ఈ సెకండ్ హీరోయిన్ రోల్ లో చాలా మంది యంగ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి కూడాను.
ఈ విషయంపై SSMB 28 నిర్మాత నాగవంశీ గారు తాజాగా క్లారిటీ ఇచ్చారు. పెళ్లి సందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఆపై ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీలీల మహేష్ కు జోడిగా SSMB 28 లో నటిస్తుందని పేర్కొన్నారు.
ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa