సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న "శాకుంతలం" సినిమా తాజాగా సంగీత ప్రచారకార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు 'మల్లికా మల్లికా' ఫస్ట్ లిరికల్ వీడియో పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించగా, సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.