బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను రాబడుతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు గత మూడ్రోజుల నుండి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక్కడే కాదు..ఓవర్సీస్ లోనూ వాల్తేరు వీరయ్య నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, గ్లోబల్ బాక్సాఫీస్ టాప్ 10 ఛార్ట్స్ లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ చిత్రంగా వాల్తేరు వీరయ్య సెన్సేషన్ సృష్టించింది. గత వీకెండ్ కి గానూ గ్లోబల్ టాప్ 10 బాక్సాఫీస్ ఛార్ట్స్ లో వాల్తేరు వీరయ్య పదవ స్థానాన్ని సంపాదించుకుంది.